E-PAPER

జగన్ -షర్మిల వివాదం వేళ హైకోర్టు బిగ్ ట్విస్ట్..

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన సోదరి, పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ ఆస్తులు షర్మిలకు దక్కుతాయా లేదా వైఎస్ జగన్ కే చెందుతాయా అన్న చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇవాళ మరో కీలక కేసులో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ముఖ్యంగా పెళ్లయిన ఆడపిల్లల హక్కులపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు జగన్-షర్మిల వివాదంలో కీలకంగా మారబోతున్నాయి.

 

రాష్ట్రంలో కారుణ్య నియామకాల విషయంలో పురుషులకు, మహిళలకు వ్యత్యాసం ఉంటుందని, తల్లితండ్రుల కుటుంబంతో వేరయిన తర్వాత ఆడ పిల్లలకు వారి ఆస్తుల్లో హక్కు ఉండదనే చర్చ జరుగుతున్న వేళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కారుణ్య నియామకాలు చేపట్టే విషయంలో లింగ భేదం ఉండదని, తల్లితండ్రుల కుటుంబంతో పెళ్లితో వేరయినంత మాత్రాన ఆడపిల్లకు హక్కులు ఉండవనే వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

 

కారుణ్య నియామకాల్లో పురుషుడు, మహిళలను వేర్వేరుగా చూడాలన్న వాదన సరికాదని హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లితండ్రుల కుటుంబంలో కుమార్తె స్ధానాన్ని పెళ్లి అంతం చేయదని వెల్లడించింది. పెళ్లయిన కూతురు తమ తల్లితండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం అనలేరని పేర్కొంది. కారుణ్య నియామకాల్లో కుమారుడు, కుమార్తెలను వేర్వేరుగా పరిగణించలేమని, ఆడపిల్లలు పెళ్లయినా, కాకున్నా జీవితాంతం పేరెంట్స్ కుటుంబంలో భాగమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

 

ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం నెలకొన్న వేళ వైఎస్ కుటుంబ ఆస్తులపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన అన్న వైఎస్ జగన్ తనకు రావాల్సిన ఆస్తుల్ని స్వార్జితం అనే పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు.. తల్లితండ్రుల కుటుంబంతో పెళ్లయిన ఆడపిల్లకు కూడా బంధం ఉంటుందని, పురుషులతో సమానంగా వారికి అన్నీ వర్తిస్తాయని చెప్పడం ఇప్పుడు షర్మిలకు కీలకంగా మారింది.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram