E-PAPER

ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా దీక్షా దివస్: కేటీఆర్..

ఈ నెల 29న తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో పాల్గొంటానని వెల్లడించారు.

 

తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలుస్తుందన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ రాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.

 

ఈ దీక్షా యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించేలా చేసిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram