E-PAPER

ఓటమి తర్వాత జగన్ మనసు మార్చుకున్నారా..?

ఓటమి తర్వాత జగన్ మనసు మార్చుకున్నారా? బీజేపీ కంటే కాంగ్రెస్ బెటరని భావిస్తున్నారా? ఆయన మాటలు ఆ విధంగా ఉన్నాయా? హర్యానా ఎన్నికల ఫలితాలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారా? అందుకే ఈవీఎంల కంటే.. బ్యాలెట్ పేపర్ ఉండాలన్న డిమాండ్ వెనుక ఏం జరుగుతోంది?

 

దేశవ్యాప్తంగా ఈవీఎంలపై మరోసారి చర్చ మొదలైపోయింది. హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు మాజీ సీఎం జగన్. హర్యానా ఎన్నికల ఫలితాలకీ ఏపీ ఎన్నికల ఫలితాలకు తేడా ఏమీ లేదన్నది జగన్ మాట.

 

ఏపీ ఎన్నికల్లో తాను ఓడిపోలేదు.. ఓడించారు, కచ్చితంగా ఈవీఎంల వల్ల జరిగిందని బలంగా నమ్ముతున్నారు వైసీపీ అధినేత జగన్. దాన్ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారాయన.

 

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నంలో పడ్డారాయన. ఈవీఎంలకు సంబంధించి ఎక్స్‌లో కొన్ని విషయాలను ప్రస్తావించారు జగన్.

 

హర్యానా ఫలితాలు ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏమాత్రం తేడా లేదన్నారు. ఏపీకి సంబంధించి ఎన్నికల కేసులు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయని రాసుకొచ్చారు. ప్రజాస్వామ్యం మరింత బలంగా ఉండాలంటే పేపర్ బ్యాలెట్‌కు వెళ్లడమే సరైన మార్గమన్నారు.

 

అభివృద్ధి చెందిన అమెరికా, యూకె, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే, డెన్మార్క్ లతో సహా కొన్ని దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్‌ని వినియోగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన దేశాలు అటువైపు వెళ్లేలా మార్పులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.

 

ఈ విషయంలో లా మేకర్స్ ముందుకు రావాలన్నది మెయిన్ సారాంశం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలపై జగన్ మాట్లాడిన వీడియో పోస్టు చేసింది టీడీపీ. సోషల్‌మీడియా ఆ వీడియో వైరల్ అయ్యింది.

 

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రస్తావించారు జగన్. ఈ లెక్కన జగన్ అంతర్గతంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లే కనిపిస్తోందన్న కామెంట్స్ రైజ్ అవుతున్నాయి. మొత్తానికి జగన్ లోగుట్టు బయటపడిందన్నది టీడీపీ నేతల మాట.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram