ఆంధ్రప్రదేశ్‌పై టాటా గ్రూప్ ఫోకస్ చేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తోంది. విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఒక విధంగా ఏపీకి బిగ్ బూస్ట్ లాంటింది. టాటా ముందుకు రావడంతో మిగతా కంపెనీలు ఏపీపై ఫోకస్ చేశాయి.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి కేవలం 100 రోజులు మాత్రమే అయ్యింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును వివిధ పారిశ్రామికవేత్తలు అమరావతి కలిశారు. ప్రభుత్వం తీసుకున్న.. తీసుకోబోతున్న పాలసీల గురించి వివరించారు. తాము పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చారు. టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ అమరావతి సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కూడా.
మూడురోజుల కిందట ముంబై వెళ్లిన మంత్రి నారా లోకేష్.. టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రొత్సాహకాలను వివరించారు మంత్రి.
ముఖ్యంగా విశాఖలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. టీసీఎస్ సెంటర్ ఏర్పాటుతోపాటు ఈవీ, ఏరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఆ సంస్థ.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో పెట్టుబడులను రప్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఐటీ, ఎలక్ట్రానిక్స్ సెక్టార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. లులూ, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ తర్వాత ఏపీకి టీసీఎస్ రావడంతో భారీ గిఫ్ట్‌గా ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
ఏపీని ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అభివృద్ధిలో తొలి స్థానం నిలిపేందుకు టీసీఎస్ కంపెనీ తొలి అడుగు అవుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. త్వరలో ఆ గ్రూప్ తో ఒప్పందం చేసుకోనుంది చంద్రబాబు సర్కార్.