E-PAPER

నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్..!

తెలంగాణలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందని ఆయన చెప్పారు. మంగళవారం కమ్మం కలెక్టరేట్ లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ప్రమోషన్లు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రమోషన్లు ఇచ్చినట్లు వివరించారు. ఉద్యోగులు బాగా పని చేయాలన్నారు.

 

విద్యుత్ స్తంభాలు పడిపోకుండా, విద్యుత్ వైర్లు వేలాడకుండా చూసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో కొంత మంది లైన్ మెన్ల సరిగా లేక విద్యుత్ శాఖ చెడ్డపేరు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. విద్యుత్ సమస్యలు, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం 12 వ తరగతి వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ నిర్వహించింది. డీఎస్సీ నిర్వహించడమే కాకుండా ఫలితాలు కూడా తక్కువ సమయంలోనే విడుదల చేశారు. ఆ తర్వాత త్వరితగతిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. అక్టోబర్ 9న డీఎస్సీలో ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఎల్బీస్టేడియంలో 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11 వేల 63 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్నారు. అలాగే ఆర్టీసీలో కూడా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ రానుంది.

 

టీజీఎస్ ఆర్టీసీలో 3035 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడాని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) ఉన్నాయి.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram