E-PAPER

హర్యానాకు కాబోయే సీఎం ఎవరు..? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడయ్యాయి..!

హర్యానాలో అధికారం దక్కేదెవరికి. తాజాగా హర్యానాలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడయ్యాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ కే అధికారం అని తేల్చి చెప్పాయి. బీజేపీ ఈ అంచనాలను కొట్టి పారేస్తుంది. రాష్ట్ర ప్రజలు తమతోనే ఉన్నారని ఇప్పటికీ ధీమాగా చెబుతోంది. అటు కాంగ్రెస్ లో సీఎం పదవి పైన రేసులోకి పలువురి పేర్లు వస్తున్నాయి. అయితే, పార్టీ నాయకత్వం మాత్రం ఇప్పటికే సీఎం పదవి పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

కాబోయే సీఎం ఎవరు

హర్యానాలో బీజేపీ పాలన ముగుస్తుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేసాయి. కాంగ్రెస్ విజయం ఖాయమని దాదాపు అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా కాంగ్రెస్ గెలుస్తుందని విశ్లేషించాయి. దీంతో,పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది. పార్టీ సీనియర్‌ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్‌ సూర్జేవాలాతో పాటు మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర హుడ్డా పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి.

 

కుమారి షెల్జాకు ఛాన్స్

సీఎం పదవి పైన జరుగుతున్న ప్రచారం పై భూపేంద్ర హుడా కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి ఎవర్న దానిపై పార్టీ హైకమాండే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని..అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని భూపేంద్ర ధీమా వ్యక్తం చేసారు. ఇక కుమారి సెల్జా సీఎం కావడంపై..ఆమె పార్టీ సీనియర్నాయకురాలు అన్న భూపేంద్ర సింగ్, అందుకే సీఎం పదవిపై ఆమెకు కూడా హక్కు ఉందన్నారు. అయితే అధిష్ఠానమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

 

ఫలితాలు వెల్లడితో

హర్యానాలో ఓట్ల లెక్కింపు.. ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ అధికారం ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తోంది. దీంతో.. సీఎం సీటుపై చర్చ మొదలైంది. బీజేపీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంతో..ఇప్పుడు ఫలితాల తరువాత హర్యానాలో చేపట్టాల్సిన కార్యాచరణ పైన కాంగ్రెస్ అధినాయకత్వం సోమవారం సమావేశం కానుంది. అటు జమ్ములో హంగ్ ఖాయమనే అంచనాల వేళ..ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram