గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనం సృష్టించిన హైడ్రా తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. కూల్చివేతలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వర్గాల్లో నెలకొన్న భయాందోళనలపై స్పష్టతనిచ్చింది. అనుమతులు ఉన్న నిర్మాణాలను కూల్చివేయబోమని, చట్టబద్ధంగా చేపట్టిన వెంచర్ల విషయంలో ఆందోళన అక్కర్లేదని భరోసా కల్పించింది.
రియల్ ఎస్టేట్‌కు భరోసా కల్పించేలా సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని ప్రకటనలో పేర్కొంది. ‘చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, చెల్లుబాటయ్యే అనుమతులున్న నిర్మాణాలను కూల్చివేయడం జరగదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది’’ అని హైడ్రా స్పష్టం చేసింది