E-PAPER

“సర్కార్ సీతారామ్” గా బాలయ్య..?

నందమూరి నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య ఒకరు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయనని ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ బాలకృష్ణ చేశారు. వైవిద్యమైన కథలకు స్వాగతం పలికారు. అయితే ఒక టైం లో మాస్ కమర్షియల్ సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ ఎంతటి ఫామ్ లో ఉన్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్యకాలంలో వరుస డిజాస్టర్లు తో సతమతమవుతున్న టైంలో అఖండ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుని ఇప్పుడు వరుస హిట్ సినిమాలను చేస్తున్నాడు.

 

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్

 

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది గెస్ట్ లు ఈ షో కి హాజరయ్యారు. ఈ షో కి హోస్ట్ నందమూరి బాలకృష్ణ అని చెప్పినప్పుడు చాలామంది అనేక విమర్శలు చేశారు. అసలు బాలకృష్ణ హోస్ట్ ఏంటి అని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. బాలయ్య నిజమైన వ్యక్తిత్వం ఏంటో ఈ షో ద్వారా బయటపడింది. బాలయ్య ఎదుటివారిని ఎలా గౌరవిస్తారో ఎంత సరదాగా మాట్లాడుతారు ఈ షో చూసిన తర్వాత అర్థమైంది.

 

వరుస హిట్ సినిమాలు

 

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను బీభత్సంగా ఎలివేట్ చేసింది. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వరుస హిట్ సినిమాలు బాలయ్య కెరియర్ లో పడ్డాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది.

 

ఈ టైటిల్స్ అనుకుంటున్నారట

 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఈ సినిమాను సంక్రాంతి కానుక రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. ఈ సినిమాకి “డాకూ మహారాజా”, “సర్కార్ సీతారామ్” అనే రెండు అనుకుంటున్నారట, ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయడానికి సిద్ధమవుతుంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.సీనియర్ స్టార్ హీరో చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ ఇప్పుడు బాలయ్య కు ఏ రేంజ్ హిట్ ఇస్తాడో వేచి చూడాలి.

Facebook
WhatsApp
Twitter
Telegram