బాలల హక్కులను కాపాడటం మన అందరి బాధ్యత అని మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అన్నారు . సోమవారం గండి మైసమ్మ రోడ్ కైసర్ నగర్ క్రాస్ రోడ్ వద్ద ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం(గవర్నమెంట్ స్పెషల్ హోం ఫర్ బాయ్స్ హైదరాబాద్)(డిపార్ట్మెంట్ ఆఫ్ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ హైదరాబాద్) లో బాలల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బాలల హక్కుల వారోత్సవాలు కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిజాంపేట్ మేయర్ మాట్లాడుతూ…ఈనెల 20న ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ.. బాలల హక్కుల గురించి ప్రజల్లో అవగాహన కలిగించి, పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ దినోత్సవం నిర్వహించబడుతుందని, పిల్లల హక్కులను పరిరక్షించడం మన బాధ్యత అని,సమాజంలో అందరి లానే చిన్నారులకు హక్కులు ఉంటాయని,ఆ హక్కుల ఉద్దేశం అభివృద్ధి మరియు రక్షణ అని తెలియజేస్తూ సత్ప్రవర్తనతో విద్యా బుద్దులు అభ్యసిస్తూ భవిష్యత్ లో ఉన్నత స్థానాలకు ఎదగాలని పిల్లలకు సూచించారు.మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సూపరింటెండెంట్& డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ సుజాత గౌతమి,మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ కాశీ విశ్వనాథ్,సీనియర్ హౌస్ మాస్టర్ ఉమేష్ మరియు ఇతర స్టాఫ్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ పిల్లలకు బాలల దినోత్సవం మరియు బాలల హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం హౌస్ లోని నూతన భవనం,పండ్లు మరియు కూరగాయల తోటలు పర్యవేక్షించి, చేనేత శిక్షణ కేంద్రాన్ని సందర్శించి పిల్లలు నేసిన బ్లాంకెట్స్, కార్పెట్స్,డోర్ మాట్స్ పరిశీలించి వారి నైపుణ్యాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత,సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,సీనియర్ నాయకులు సుబ్బారెడ్డి,ఆంజనేయ వర్మ,భాస్కర్ చారి,మధుకర్ రెడ్డి,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.