మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.
మహారాష్ట్రలోని 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ(అజిత్ పవార్), శివసేన( ఏక్‌నాథ్ షిండే)ల మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్సీజీ(శరద్ పవార్), శివసేన( ఠాక్రే)ల మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) పోటీ చేశాయి. మెజారిటీ మార్క్ 145 సీట్లు.
జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉంటే మెజారిటీ మార్క్ 41. బీజేపీ ఎన్డీయే కూటమి, కాంగ్రెస్, జేఎంఎంల మహాఘట బంధన్ పోటీ చేశాయి.
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు-288.. మ్యాజిక్ ఫిగర్-145
పీపుల్స్ పల్స్:
మహాయుతి- 175-196 ( బీజేపీ-113, శివసేన -52, ఎన్సీపీ-17)
మహా వికాస్ అఘాడీ – 85-112 ( కాంగ్రెస్-35, శరద్ పవార్-40, ఉద్ధవ్ ఠాక్రే-28)
చాణక్య స్ట్రాటజీస్:
మహాయుతి- 152-160 ( బీజేపీ-90+, షిండే-48+, ఎన్సీపీ-22+)
మహా వికాస్ అఘాడీ- 130-138 (కాంగ్రెస్-63+, ఉద్ధవ్ ఠాక్రే-35+, శరద్ పవార్-40+)
జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. మొత్తం స్థానాలు 81.. మ్యాజిక్ ఫిగర్ -41
చాణక్య స్ట్రాటజీస్:
ఎన్డీయే-45-50 ( బీజేపీ 40+, ఏజేఎస్‌యూ-5+, జేడీయూ -1+, ఎల్‌జేపీ 0)
ఇండియా కూటమి -35-38 ( జేఎంఎం-26+, కాంగ్రెస్- 10+, ఆర్జేడీ-3+)
పీపుల్స్ పల్స్:
ఎన్డీయే (బీజేపీ+ఏజేఎస్‌యూ) – 46-58
ఇండియా కూటమి( కాంగ్రెస్+జేఎంఎం) -24-37