ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురావడానికి సిద్ధం అయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి అనుమతి తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
ఊపిరి పీల్చుకున్న సజ్జల, డీజీపీ, ఎస్పీకి హైకోర్టు నోటీసులు
ఉద్యోగంలో చేరినప్పటి నుండి పట్టణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేలా కొత్త చట్టం తీసుకొస్తున్నారు. బదిలీలకు గరిష్టంగా 8 సంవత్సరాల సర్వీస్ నిర్ణయించనున్నారని, కనీస సర్వీస్ సమయం ఎంత అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉండే ప్రాంతాలను నాలుగు కేటగిరులు విభజించడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ కొత్త చట్టం వచ్చిన తరువాత సిఫారసు బదిలీలు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది. బదిలీల చట్టంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యక్ష ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారని సమాచారం. ఇలాంటి ప్రత్యేక చట్టం ఇప్పటికే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో ఉన్నాయి.
ఇలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మెరిట్ కమ్ రోస్టర్ పద్దతి అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు వారి సమస్యలు, టీచర్ల బదిలీల గురించి, ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాల గురించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు పలు సూచనలతో పాటు వారి సమస్యలపై మనవి చేశారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ అధికారులు చర్చలు జరిపి ఓ వేదిక సిద్ధం చేసి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సమర్పించనున్నారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారని, అలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు మనవి చేశారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.