తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు సర్కార్ ప్రతిపాదనలను తిరస్కరించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి ఈఆర్సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)ను కలిశారు.
ఒక్కో మీటర్ పై 300 యూనిట్లు దాటితే, యూనిట్‌కు రూ.10 వసూలు చేయడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. జీఓ నెంబర్ 29ను రద్దు చేసి పాత పద్ధతిలోనే జీఓ నెంబర్ 55ను యథావిధిగా కొనసాగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్షలు రద్దు చేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని, ప్రభుత్వం పట్టించుకోకుండా పరీక్షలు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 అభ్యర్తులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోతోందన్నారు. మూడు రోజులుగా గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు.