E-PAPER

సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

విధి నిర్వహణలో అసువులుబాసి అమరులైన పోలీసులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. రాష్ట్రం అభివృద్ధి పదంవైపు నడవాలంటే పోలీసులు కీలకమన్నారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని, పండుగల నిర్వహణలో శాంతిభద్రతలను కాపాడడంలో అలసత్వం వద్దని సూచించారు. సైబర్ క్రైం ఛేదనలో తెలంగాణ విధానాన్ని కేంద్రం కూడా మెచ్చుకుందని గుర్తు చేశారు.

 

రేవంత్ కీలక వ్యాఖ్యలు

శాంతి భద్రత లేని రాష్ట్రం ఉంటే పెట్టుబడులు రావని.. రాష్ట్రం అభివృద్ధికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని అభినందించారు. రాష్ట్రంలో క్రైం రేటును నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటోందని రేవంత్ వివరించారు. గంజాయి, డ్రగ్స్ కట్టడికి టీజీ న్యాబ్ ఏర్పాటు చేసామని గుర్తు చేసారు. నేరాలకు పాల్పడే వారిని శిక్షించడానికి పోలీసులు సిద్ధంగా ఉండాలని సూచించారు. అమరులైన పోలీస్ అధికారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.

 

కఠినంగా ఉండాల్సిందే

తీవ్రవాదులు, మావోయిస్టు చేతుల్లో మరణించిన అధికారులను స్మరించుకోవడం అందరికి స్ఫూర్తిదాయకమని రేవంత్ ప్రశంసించారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. డ్రగ్స్ మహమ్మారి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసారు. పంజాబ్ రాష్టంలో డ్రగ్స్ వినియోగం పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు టీజీఎన్‌ఏబీను ఏర్పాటు చేశామని గుర్తు చేసారు. దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పిన ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు.

 

సహించేది లేదు

ఇదే సమయంలో రేవంత్ ప్రార్ధనా మందిరాల పైన దాడులు చేస్తున్న వారిని హెచ్చరించారు.

మందిరాల మీద, మజీద్‌ల మీద దాడులు చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇటీవల ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శాంతి భద్రతలు తమ చేతిల్లోకి తీసుకునే వారి పట్ల కఠినంగా ఉండాలని రేవంత్ ఆదేశించారు.

 

క్రిమినల్స్‌తో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండడం కాదని.. బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. క్రిమినల్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలీస్ కుటుంబాల కోసం యంగ్ ఇండియా స్కూల్‌ను ఈరోజు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇక నుంచి కోటి రూపాయలు నష్ట పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram