E - PAPER

E-PAPER

బాల్క సుమన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు.. రేవంత్ రెడ్డి ఫైర్..

టికెట్ల పంపణీ, నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగా సభల్లో పాల్గొంటు..

శ్రేణుల్లో ఉత్సహం నింపుతున్నారు. శనివారం బెల్లంపల్లిలో జరిగిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వాళ్ల అరాచకాలు, దుర్మార్గాలను అంతం చేయాలన్నారు. బెల్లంపల్లిలో గడ్డం వినోద్ కుమార్ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చెన్నూరులో గడ్డం వివేక్ వెంకటస్వామిని గెలిపించాలని కోరారు. వెంకటస్వామి కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాణం పోసుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన గొప్ప వ్యక్తి కాకా వెంకటస్వామి అని కొనియాడారు. వెంకటస్వామి నిరంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పని చేశారని చెప్పారు. ఢిల్లీలో సొంత ఇంటిని AICC ఆఫీసుకు ఇచ్చిన కుటుంబం కాకాది అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

వివేక్ వెంకటస్వామి వ్యాపారం చేసి కష్టపడి డబ్బులు సంపాదించారని వివరించారు. కానీ బాల్క సుమన్ ఏ వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడో చెప్పాలని నిలదీశారు.కల్వకుంట్ల కుటుంబం మంచిర్యాల జిల్లాను నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వివేక్,వినోద్ గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో రాక్షస పాలనను తరిమికొట్టే సమయం వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వివేక్ హామీ ఇచ్చారు. సోనియాగాంధీతో తెలంగాణ ఇప్పించే ఘనత వెంకటస్వామికే దక్కిందని బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ చెప్పారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం వివేక్ కృషి చేశారని గుర్తు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram