E - PAPER

E-PAPER

వేములవాడ ప్రజలు తీర్పు ఎలా ఇస్తారో..

వేములవాడ.. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాసిల్లుతోంది. ఇప్పుడు వేములవాడలో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.

వేములవాడలో బీఆర్ఎస్ నుంచి చల్మెడ లక్ష్మనరసింహ రావు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ సిట్టింగ్ అభ్యర్థిగా చెన్నమనేని రమేష్ రావు ఉన్నారు. ఆయనపై పౌరసత్వం కేసు ఉండడంతో టికెట్ చల్మెండకు కేటాయించారు. దీంతో స్థానిక నాయకులు చల్మెడకు సరిగా సహకరించడంలేదని తెలుస్తోంది.

అయినప్పటికీ చల్మెడ ప్రచారం కొనసాగిస్తోన్నారు. కేటీఆర్ సొంత జిల్లా కావడంతో వేమువాడలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తన పక్క నియోజకవర్గామే కావవడంతో.. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిసిస్తే.. వేములవాడను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. చల్మెడను గెలిపించకపోతే ఇక వేములవాడకు రానని చెప్పడం అంటే కేటీఆర్ తనవద్ద ఉన్న అస్త్రాలన్నీ వాడేసినట్లుగా తెలుస్తోంది. వేములవాడలో సిట్టింగ్ మార్చడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పడైనా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. ఆది శ్రీనివాస్ పై ప్రజల్లో సానుభూతి కొనసాగుతోంది. నాలుగుసార్లు ఓడిపోవడంతో ఈసారైనా తనను గెలిపించాలన ఆది శ్రీనివాస్ ప్రజలను కోరుతున్నారు. ప్రజలు కూడా ఆయన పట్ల సానూకులంగా స్పందిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడైన పుల్కంరాజు, ఆయన సతీమణితో కలసి హస్తం గూటికి చేరుకున్నారు.

దీంతో వేములవాడలో చల్మెడ లక్ష్మినరసింహ రావు ఎదురీదక తప్పడం లేదు. అటు బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ రావు పోటీ చేస్తున్నారు. బీజేపీ వేములవాడ టికెట్ ను మొదటగా తూల ఉమకు కేటాయించారు. కానీ ఆఖరి నిమిషంలో వికాస్ రావుకు బీ ఫామ్ ఇచ్చారు. దీంతో తూల ఉమ వెక్కి వెక్కి ఏడ్చారు. తూల ఉమ ఈటల రాజేందర్ వర్గంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే వికాస్ రావు ప్రచారం ప్రారంభించారు. తన తండ్రికి ఉన్న పలుకుబడితో ముందుకెళ్తున్నారు.

చల్మెడ లక్ష్మీనరసింహ రావు, వికాస్ ఒకే సమాజిక వర్గానికి చెదినవారు. ఇద్దరూ వెలమ కులానికి సబంధించిన వారు. పైగా చెన్నామనేని రమేష్ కు వికాస్ రావు బంధువు కూడా. ఈ నేపథ్యంలో రమేష్ వర్గీయులు పూర్తిస్థాయిలో చల్మెడకు మద్దతివ్వడం అనుమానంగానే ఉంది. దీంతో వేములవాడలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం అంత సులవు కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. నవంబర్ 30న వేములవాడ ప్రజలు ఎవరి వైపు నిలబడతారో చూడాలి.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram