E-PAPER

క్రెడిబిలిటీ లేని పార్టీలే డిక్లరేషన్లు ఇచ్చేది; రాష్ట్రంలో ఉంది పింక్ వేవ్ నే: కవిత

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీలు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజాగా బిసి డిక్లరేషన్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జోష్ ఏమీ లేదని, కాంగ్రెస్ జోష్ గాంధీభవన్ వరకే పరిమితమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో పింక్ వేవ్ తప్ప మరో వేవ్ లేనేలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఫెయిల్యూర్ స్టేట్ ఫెయిల్యూర్ సీఎంను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

తప్పుడు సర్వేలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన వచ్చే సీన్ కాంగ్రెస్ పార్టీకి లేదని కవిత తేల్చి చెప్పారు. క్రెడిబిలిటీ లేని పార్టీలు, నాయకులు మాత్రమే డిక్లరేషన్లు ఇస్తాయని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కవిత తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు.

సిద్ధరామయ్య ఫెయిల్యూర్ సీఎం అని, కర్ణాటక ఫెయిల్యూర్ స్టేట్ అంటూ కవిత పేర్కొన్నారు. కర్ణాటకలో మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర సీఎం కేసీఆర్ దని పేర్కొన్న కవిత మేనిఫెస్టోలో చేర్చని హామీలను కూడా అమలు చేశారని వెల్లడించారు. గొప్ప రాష్ట్రమైన కర్ణాటకలో నాయకత్వ సంక్షోభం ఏర్పడిందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.

తెలంగాణ వంటి రాష్ట్రాలకు వచ్చే ముందు ఇక్కడ స్థితిగతులు తెలుసుకొని రావాల్సిన అవసరం ఉంటుందని సిద్ధ రామయ్యకు హితవు పలికారు. సిద్ధరామయ్య సీఎం కేసీఆర్ కు పాఠాలు చెప్పే స్థాయి కాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో సాగిన భయానక పాలనను గుర్తు చేసుకుని ఎన్నికల్లో ఓట్లు వేయాలని, కెసిఆర్ కార్ ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram