ఓ వ్యక్తి ఏటీఎం తగులబెట్టిన ఘటన ముంబైలోని బోరివలిలో జరిగింది. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM)ను పగలగొట్టి, డబ్బు దొంగిలించే క్రమంలో వ్యక్తికి ఏటీఎం ఓపెన్ కాకపోవడంతో తగులబెట్టాడు.
పెట్రోలింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సతారా నివాసి ఓంకార్ విలాస్ శీలవంత్ (22)గా గుర్తించారు.
ఈ విషయమై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బోరివలి వెస్ట్‌లోని షింపోలీ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు బ్రాంచ్ ఉంది. బ్రాంచ్ పక్కనే ఏటీఎం కూడా ఉంది. నవంబర్ 11వ తేదీ తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బ్యాంక్‌లోని నిఘా విభాగంలో పనిచేస్తున్న రమేష్ నాయక్ మేనేజర్ దీపక్ షాహకర్ (42)కు ఫోన్ చేసి బ్యాంక్ ఏటీఎం మిషన్ డిస్‌ప్లే కాలిపోయిందని సమాచారం అందించాడు.
షహకర్ వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లాడు. ప్రాథమిక తనిఖీ అనంతరం మధ్యాహ్నం 2.47 గంటల ప్రాంతంలో ఎవరో ఏటీఎం మిషన్‌ను తెరిచేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఓ వ్యక్తి కియోస్క్‌లోకి ప్రవేశించినట్లు కనిపించింది. ఆ వ్యక్తి యంత్రాన్ని పగులగొట్టడానికి ప్రయత్నించడం కనిపించింది.తరువాత యంత్రానికి నిప్పు పెట్టాడు. అయితే డబ్బు దోచుకోవడంలో విఫలం కావడంతో అతడు పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
ఫిర్యాదు చేసేందుకు బోరివాలి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ అందించారు. ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న శీలవంత్ అనే వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు పట్టుకున్నట్లు పోలీసులు పట్టుకున్నారు.అతనే నిందితుడని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.