E-PAPER

ప్రేమించినవాడితో సమంత రెండో పెళ్లి.. ఎప్పుడంటే..?

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సిటాడెల్ హనీబన్నీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ది ఫ్యామిలీ మ్యాన్మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. హనీగా సామ్.. బన్నీగా వరుణ్ ధావన్ కనిపించారు. సిరీస్ అంతగా హిట్ అవ్వకపోయినా సామ్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

 

ఇక ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. మా ఇంటి బంగారం సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసింది కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. ఇది కాకుండా రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్ డమ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ ఏడాది సామ్ జీవితంలో చాలా జరిగాయి. మూల్యంగా సామ్.. ఈ ఏడాదే తన తండ్రి జోసెఫ్ ను కోల్పోయింది. అనారోగ్య కారణాలతో సామ్ తండ్రి ఇటీవలే కన్నుమూసిన విషయం తెల్సిందే. దీంతో ఆమె మరింత ఒంటరి అయ్యింది.

 

సామ్ కు ఇలాంటి కష్టాలు సాధారణంగా మారిపోయాయి. ఒక్కతే వాటిని ఎదుర్కోవడం కూడా సాధారణంగా మారిపోయింది.అందుకే సామ్ సైతం.. ఎలాంటి సమస్య వచ్చినా దైర్యంగా నిలబడి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్.. తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. 2024 ఎండ్ కు వచ్చేసరికి.. సామ్ కొత్త ఏడాది ఎలా ఉండాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన రాశి వారికి వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో రాసి ఉన్న ఒక పోస్ట్ ను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 

వచ్చే ఏడాది వృషభ, మకర, కన్యరాశిల వారి లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే.. వారు ఏడాదంతా బిజీగా గడుపుతారు, వృత్తి పరంగా ముందుకు వెళ్తారు, డబ్బులు ఎక్కువగా సంపాదిస్తారు, ఆర్థికంగా బలంగా ఉంటారు, ప్రేమను పంచే భాగస్వామిని పొందుతారు( ప్రేమించినవారికి పెళ్లాడతారు), పాత లక్ష్యాలను పూర్తి చేస్తారు, ఆదాయం వచ్చే మార్గాలు ఇంకా పెంచుకుంటారు, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా ధృడంగా ఉంటారు. 2025 లో పిల్లలు పుడతారు” అంటూ చాలా పాయింట్లు ఉన్నాయి.

 

ఇవన్నీ సామ్ కు అనుకూలంగానే ఉండడంతో.. వచ్చే ఏడాది సామ్ లైఫ్ కూడా ఇలానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ బిజీగా ప్రాజెక్ట్స్ ను లైన్లో పెడుతుంది. వచ్చే ఏడాది బిజీగానే ఉంటుంది. మానసికంగానే కాకుండా శారీరకంగా దృఢంగా ఉండడానికి సిద్ధం అవుతుంది. ఇక వచ్చే ఏడాది అమ్మడి లైఫ్ లోకి ప్రేమించేవాడు భర్తగా రాబోతాడు.

 

పెళ్లి చేసుకొని పిల్లలకు కూడా ఆమె జన్మనివ్వనున్నట్లు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే సామ్ అభిమానులకు అంతకుమించిన హ్యాపినెస్ ఇంకొకటి ఉండదు. సామ్ మాజీ భర్త చైతన్య గతాన్ని మర్చిపోయి.. నటి శోభితాను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. వచ్చే ఏడాది సామ్ కూడా పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. అయితే సామ్ ను పెళ్లాడే వరుడు ఎవరు.. ?అనేది తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram