E-PAPER

అందరూ వాళ్ల మనుషులే… మరి బియ్యం ఎలా వస్తున్నాయి..?: జగన్

కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని, దీనికి మూలాలు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయని కూటమి నేతలు ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు.

 

అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్లదే, మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, వాళ్లే చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నారు, పోర్టులో కస్టమ్స్ సిబ్బంది వాళ్ల మనుషులే, భద్రతా సిబ్బంది కూడా వాళ్ల మనుషులే… అయినప్పటికీ బియ్యం తరలిపోతున్నాయంటే ఎవరు కారణం? ఆరు నెలలుగా కూటమి పాలన జరుగుతున్నా చెక్ పోస్టులు దాటుకుని మరీ బియ్యం వస్తున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు.

 

మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు బియ్యం ఎక్స్ పోర్ట్ లో నెంబర్ వన్ గా ఉన్నారు… ఇటీవల పోర్టులో డిప్యూటీ సీఎం తనిఖీలు చేశారంటున్నారు… కానీ పయ్యావుల వియ్యంకుడు ఎగుమతులు చేస్తున్న ఆ షిప్ ను మాత్రం తనిఖీ చేయలేదు అంటూ జగన్ ఆరోపించారు.

 

ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులతో జగన్ ఇవాళ తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram