E-PAPER

మోహన్‌బాబు ఫ్యామిలీ ఇష్యూ..!

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది.

 

తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ బౌన్సర్లను బయటకు ఎలా పంపుతారని మౌనిక పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా అందులో ఉంది. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. తన భర్త మనోజ్‌కు గాయాలయ్యానని ఆమె చెప్పినట్లుగా ఉంది. కాగా, ఇది నిన్న మోహన్ బాబు నివాసానికి వెళ్లినప్పటిదిగా తెలుస్తోంది.

 

అదనపు డీజీపీని కలిసిన మనోజ్ దంపతులు

 

మంచు మనోజ్, మౌనిక దంపతులు తెలంగాణ అదనపు డీజీపీని కలిశారు. తమ కుటుంబంలో గొడవ, తదితర పరిణామాలపై వివరించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ డీజీని కూడా వారు కలిశారు.

Facebook
WhatsApp
Twitter
Telegram