డిసెంబర్ ఐదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కంటే ముందు రోజు రాత్రి కొన్నిచోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాదులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న కొన్ని థియేటర్స్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సెలబ్రిటీస్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్స్ లో సినిమా చూడడానికి ఇష్టపడతారు. దీని కారణం సింగిల్ స్క్రీన్ లో కొన్ని సినిమాలు చూడటం అనేది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఇక పుష్ప (Pushpa) సినిమా ముందు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్లో ప్రీమియర్స్ వేశారు. ఇక్కడ ప్రీమియర్ షో కి అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు హాజరయ్యాడు. అల్లు అర్జున్ వస్తున్నాడు అని తెలియగానే, చాలామంది ప్రేక్షకులతో పాటు టికెట్ తీయకుండా అభిమానులు కూడా వచ్చేశారు. ఇలా బీభత్సమైన క్రౌడ్ రావడంతో ఒక విషాదకరమైన ఘటన జరిగింది.
రేవతి అనే ఒక ఆమె తన కుటుంబ సభ్యులతో పాటు పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో కి హాజరైంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ కూడా థియేటర్ కి రావడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఈ ఘటనలో రేవతి మృతి చెందారు, తన కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది. రేవతి ఇబ్బంది పడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ ఘటనపై అల్లు అర్జున్ మాట్లాడలేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పలు విమర్శలు వచ్చాయి. మొత్తానికి దీనిపై అల్లు అర్జున్ నోరు విప్పారు. ఏకంగా మూడు నిమిషాల పాటు ఈ ఘటన గురించి మాట్లాడుతూ కుటుంబానికి భరోసా తెలియజేశారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ…
సంధ్య థియేటర్ కి సినిమా చూసేందుకు వెళ్లాను. సినిమా చూసి వచ్చిన తరువాత మహిళా చనిపోయారు, బాబుకి సీరియస్ అని తెలిసింది.నేను, సుకుమార్ (Sukumar) , టీమ్ (Pushpa Movie Team) అంతా చాలా బాధ పడ్డాము. రేవతి గారి ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నాను.మేము ఏం చేసినా ఆ లోటును భర్తీ చెయ్యలేను.కానీ అన్నిటికీ మేము మీతో ఉంటాము, 25 లక్షలు వారి ఫ్యూచర్ కోసం ఇస్తున్నాను.ఈ 25 లక్షలకి సంబంధం లేకుండా మెడికల్ ఖర్చులు భరిస్తా.ఫ్యామిలీ భాద్యత నాది.మేము సినిమా తీసేది ఆడియన్స్ ను సంతోష పెట్టాలనే. సినిమా చూసి ఇంటికి సేఫ్ గా వెళ్లండి. అంటూ ఎమోషనల్ కి గురి అయ్యారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ మాటలతో అన్ని విమర్శలకు ఒక్కసారిగా చెక్ పెట్టాడు అని చెప్పాలి.