ఈ ఏడాది సెలబ్రిటీలందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందదే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తాముప్రేమించిన వారిని కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లాడారు. ఇక నిన్ననే అక్కినేని నాగచైతన్య- శోభితల వివాహం కూడా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని,ధూళిపాళ్ల, దగ్గుబాటి కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతిరథ మహారధులు వీరి పెళ్లికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్టులో కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా చేరింది. నేను శైలజ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కీర్తి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని టాలీవుడ్లో పాతుకు పోయింది. ఇక మహానటి సినిమాతో కేవలం తెలుగు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
మహానటి సినిమాకు గాను ఆమెజాతీయ అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వరస సినిమాలతో బిజీగా మారిన కీర్తి సురేష్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యింది. తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఆంటోనీతో ఆమె ఏడడుగులు వేయనుంది.
ఎప్పటినుంచో కీర్తి ఒకరితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. కొంతమంది ఒక సీనియర్ హీరోతో కీర్తి పెళ్లి అని, ఇంకొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ తో కీర్తి పెళ్లి జరుగుతుందని పుకార్లు పుట్టించారు. ఈ పుకార్లను కీర్తి తండ్రి కొట్టిపడేశాడు. తన కూతురు పెళ్లి నిజంగా జరిగితే తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పుకొచ్చాడు.
ఇక చెప్పినట్టే కొన్ని రోజుల క్రితం కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో పెళ్లి జరగబోతుందని అధికారికంగా ప్రకటించింది. 15 ఏళ్లుగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి డేట్ ఎప్పుడు.. ?పెళ్లి ఎక్కడ.. ?అనే వివరాలు ఏమి తెలియలేదు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం కీర్తి సురేష్ ఆంటోనీలా పెళ్లి పనులు మొదలైనట్లు తెలుస్తుంది.
కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక పెళ్లి పత్రిక వైరల్ గా మారింది. ఇందులో డిసెంబర్ 12న కీర్తి సురేష్- ఆంటోనీ వివాహం జరగనున్నట్లు రాసి ఉంది. మొదటినుంచి కీర్తి తన పెళ్లిని గోవాలోని జరుపుకోవాలని ఆశ పడినట్లు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పవచ్చింది. ఇక తన ఆశ ప్రకారమే గోవాలో డిసెంబర్ 12న వీరి వివాహం జరగనుందని సమాచారం. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్ లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
ఇక కీర్తి సురేష్ కెరీర్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఆమె చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే హిందీలో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ తమిళ్ లో రెండు సినిమాలను పట్టాలెక్కించింది. త్వరలోనే ఈ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరి పెళ్లి తర్వాత కీర్తి సినిమాల్లో నటిస్తుందా.. ? లేదా గ్యాప్ ఇస్తుందా..? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.