E-PAPER

పుష్ప 2 కలెక్షన్స్ తో రికార్డు లా మోత…! ఆర్ఆర్ఆర్ బీట్ చేసిందా..?

ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పుష్ప 2 ను చూడాలన్న అభిమానుల కోరిక నిన్నటితో నెరవేరింది. ఇవాళ దేశ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు వంటి ప్రముఖులు నటించిన మూవీ పుష్ప2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల తర్వాత పుష్పరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు?.. సినిమాలో హైలెట్ అంశాలు ఏంటి? ఇక కలెక్షన్స్ ఎంత రాబట్టిందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి సినిమా అన్ని ఏరియాల్లో రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ ను అందుకుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం..

 

పుష్ప పార్ట్ 1 లో కొనసాగిన కథతో మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్‌తో పాటు రాజకీయాలను ఎలా శాసించాడు? భన్వర్ సింగ్ షెకావత్‌పై ఎలా పై చేయి సాధించాడు? ఎన్నో అంచనాల మధ్య రిలీజైన పుష్ప 2 తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందోనని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.. పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రమోషన్ కార్యక్రమాలు మొత్తం కలిపి దాదాపు రూ. 500 కోట్లవరకు బడ్జెట్ ను పెట్టారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్, టీజర్, అల్లు అర్జున్ లుక్ అన్నీ పుష్ప 2పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది.. రిలీజ్ కు భారీగా వసూల్ చేసిందని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది.

 

ఏపీ తెలంగాణ రాష్ట్రాల తో పాటుగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డు స్థాయిలో రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రూ. 425 కోట్ల వ్యాపారం చేసింది పుష్ప 2. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ రూ. 275 కోట్లతో ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. అలాగే శాటిలైట్ రైట్స్ కింద రూ. 85 కోట్లు, రూ. 65 కోట్లు మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలోబిజినెస్ జరిగిందని తెలుస్తుంది.. మొత్తానికి రూ. 1200 కోట్ల గ్రాస్ , రూ. 620 కోట్ల షేర్ లక్ష్యంగా పుష్ప 2 బరిలో దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11000 వేల స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు మేకర్స్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్మురేపిన పుష్ప 2 ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తంగా తొలి రోజు పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 184 కోట్ల గ్రాస్ వసూళ్లని సాధించినట్లు తెలుస్తోంది. నిజాంలో 72 కోట్లు, సీడెడ్ లో 26 కోట్లు, వైజాగ్ లో 21 కోట్లు, ఈస్ట్ గోదావరి 16 కోట్లు, వెస్ట్ 12 కోట్లు, కృష్ణ కూడా 12 కోట్లు, గుంటూరు 17 కోట్లు, నెల్లూరు దాదాపు 8 కోట్ల వరకు వసూల్ చేసిందని తెలుస్తుంది. ఇక ఈ వీకెండ్ భారీగా వసూల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ కూడా మొదలైనట్లు సమాచారం.. మొత్తానికి ఈ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ముందుగా అనుకున్నట్లు మరి వెయ్యి కోట్లను రాబడుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ఇదే దూకుడుతో ముందుకు వెళ్తే మాత్రం బాహుబలి, ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ ను సులువుగా దాటేస్తుందని సినీ ట్రేడ్ పంతులు చెబుతున్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram