E-PAPER

సుక్కు క్రేజీ ఐడియా..! పుష్ప3 లో విలన్ గా విజయ్ దేవరకొండ..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవర్ కనిపిస్తోంది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి మూవీ లవర్స్ తో పాటు అల్లు అర్జున్ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇక రేపు రాత్రి ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ రిలీజ్ కాకముందే ‘పుష్ప 3’ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

నిజానికి ఇప్పటికే ‘పుష్ప 2’ తర్వాత ‘పుష్ప 3’ (Pushpa 3) మూవీ కూడా ఉంటుందని చిత్ర బృందం అఫీషియల్ గా చెప్పేసింది. డైరెక్టర్ సుకుమార్ నుంచి మొదలుపెడితే… నిర్మాతలు, అల్లు అర్జున్, సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న ఫాహద్ ఫాజిల్ కూడా వివిధ సందర్భాల్లో ‘పుష్ప 3’ ఉంటుందని చెప్పేసారు. ఇక నిన్న రాత్రి జరిగిన ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా సుకుమార్ తనకు ఇంకో మూడేళ్ల సమయం ఇస్తే బన్నీతో ‘పుష్ప 3’ సినిమా తీస్తానని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రసూల్ పూకుట్టి ‘పుష్ప 2’ ఫైనల్ సౌండ్ మిక్సింగ్ అయ్యాక దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో స్క్రీన్ పై ‘పుష్ప 3’ ఉండడంతో ఈ సినిమా గురించి ఆయన చెప్పకుండా చెప్పేసినట్టుగా అయింది. ఆ తర్వాత రసూల్ ఆ పిక్ ను డిలీట్ చేశాడు అనుకోండి… అది వేరే విషయం.

 

ఇక ‘పుష్ప 3’ సినిమాకు టైటిల్ ఏంటనే విషయం కూడా ఇప్పటికే తెలిసిపోయింది. ‘పుష్ప 3 : ది రాంపేజ్’ (Pushpa 3) అనే టైటిల్ తో ఈ సినిమా రిలీజ్ కాబోతోందని, ‘పుష్ప 2’ చివర్లో ఈ సినిమాకు సంబంధించిన లీడ్ ఇస్తారని టాక్ నడుస్తోంది. కానీ ఈ సినిమాను ఎప్పుడు తీస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ‘పుష్ప 3’ సినిమాలో రష్మిక మందన్న రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విలన్ గా నటించబోతున్నాడు అనే సెన్సేషనల్ న్యూస్ నేషనల్ మీడియా సర్కిల్ లో వైరల్ అవుతుంది.

 

రష్మిక బాయ్ ఫ్రెండ్ అంటే ఈపాటికే అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆయన మరెవరో కాదు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ‘పుష్ప 3’ సినిమాలో విజయ్ దేవరకొండ విలన్ గా నటించబోతున్నాడని, ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో పార్ట్ 3కి సంబంధించి లీడ్ ఇచ్చే సీన్లో విజయ్ దేవరకొండ కనిపిస్తాడనే వార్త సంచలనంగా మారింది. నిజానికి ఈ సినిమాలో నటిస్తున్నట్టు ముందుగానే హింట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

 

2022లో సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఆయనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు. అదే టైమ్ లో 2021- ది రైజ్, 2022-ది రూల్, 2023-ది ర్యాంపేజ్ ఉంటుందని పోస్ట్ చేశాడు. అంటే అప్పట్లోనే ‘పుష్ప’ 3 పార్ట్స్ అని, మూడవ భాగం లో విలన్ గా విజయ్ దేవరకొండ ఫైనల్ అయ్యి ఉంటాడని అనుకుంటున్నారు మూవీ లవర్స్. మొత్తానికి ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రూమర్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram