ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటూ ఉంటాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. మరి చిన్నప్పటి నుంచి ఆయన నటనను, డ్యాన్స్ ను చూస్తూ పెరిగి.. కనీసం ఒక్కసారైనా ఆయనను కలిస్తే చాలు అనుకున్న ఒక కుర్రాడు.. ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టి, మెగాస్టార్ ని మెప్పించి.. ఆయనతో కలిసి ఫోటో దిగడమే కాకుండా.. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఒక అభిమానికి ఇంతకు మించిన సక్సెస్ ఉంటుందా.. ? అంటే లేదనే చెప్పాలి.
న్యాచురల్ స్టార్ నాని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మరో కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. వీరి కాంబోలో వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దసరా తరువాత .. స్టార్ హీరోలందరూ అతడి కోశాంబి ఎదురుచూడడం మొదలుపెట్టారు అంటే అతిశయోక్తి కాదు.
ఇక ఈ నేపథ్యంలోనే తన రెండో సినిమాను తనకు లైఫ్ ఇచ్చిన నానితోనే చేయడానికి రెడీ అయ్యాడు. ది ప్యారడైజ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి శ్రీకాంత్ ఓదెల – మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఒక సినిమా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నేడు ఆ వార్తలను నిజం చేస్తూ నాని.. చిరంజీవి ఓదెల సినిమాను అధికారికంగా ప్రకటించాడు.. “ఆయన స్ఫూర్తితో నేను పెరిగాను.. నేను ప్రతిసారీ గంటల తరబడి ఆయన ఇంటిదగ్గర లైన్లలో నిల్చున్నాను. ఆయన కోసం నేను నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన ప్రతి విషయాన్నీ నేను సెలబ్రేట్ చేశాను. ఇప్పుడు నేను ఆయనను ప్రెజెంట్ చేస్తున్నాను.. ఇది పూర్తి జీవిత చక్రం.. మెగాస్టార్ మ్యాడ్ నెస్ ను బయటపెట్టడానికి మేము ఎదురుచూస్తున్నాం ” అని నాని రాసుకొచ్చాడు.
అంతేకాకుండా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో రక్తం కారుతున్న చేతిని చూపిస్తూ.. ” వైలెన్స్ లో అతడు.. అతని శాంతిని కనుగొన్నాడు” అని రాసుకొచ్చారు. ఆ ఒక్క ట్యాగ్ లైన్.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేస్తుంది. చిరు వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెల్సిందే.
ఇక దసరా చూసాకా శ్రీకాంత్ వైలెన్స్ ఏ స్థాయిలో చూపిస్తాడో కూడా చూసాం. ఇప్పుడు ఈ కాంబో కలిసింది అంటే.. ఆ సినిమా ఈ ఉండబోతుందో అభిమానుల ఊహకే వదిలేయాలి. ఇది మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ అని చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాడో చూడాలి.