E-PAPER

మాజీ మంత్రి రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..

మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజాపై దళిత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్ లో దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

 

వివరాల్లోకి వెళితే… 2023 ఫిబ్రవరిలో సూర్యలంక బీచ్ కు పర్యాటక మంత్రిగా ఉన్న రోజా వెళ్లారు. ఆమె సముద్రపు నీటిలోకి దిగే ముందు ఒడ్డున చెప్పులు వదిలారు. చెప్పులను జాగ్రత్తగా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో, పర్యాటక శాఖ రిసార్ట్స్ లో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఆమె చెప్పులను మోశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే… దళితులను రోజా అవమానించారంటూ కర్నూలు పోలీస్ స్టేషన్ లో ఈరోజు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram