E-PAPER

ఏపీలో మందుబాబుల‌కు గుడ్ న్యూస్..!

ఏపీలో మందుబాబుకు స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు బ్రాండ్ల మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. ఇప్ప‌టికే చీప్ లిక్క‌ర్ క్వార్ట‌ర్ ప్ర‌భుత్వం రూ.99 రూపాయ‌ల‌కు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా రాయ‌ల్ చాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్ట‌ర్ ధ‌ర రూ.230 నుండి రూ.210కి త‌గ్గించింది. ఫుల్ బాటిల్ ధ‌ర రూ. 930 నుండి రూ.840కి త‌గ్గించింది. మెన్ష‌న్ హౌస్ క్వార్ట‌ర్ ధ‌ర‌ను రూ. 220 నుండి రూ.190కి త‌గ్గించింది.

 

ఫుల్ బాటిల్ ధ‌ర రూ.870 నుండి రూ.760 రూపాయ‌ల‌కు త‌గ్గించింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధ‌ర రూ.1600 నుండి రూ.1400 ల‌కు త‌గ్గించింది. త్వ‌ర‌లోనే మ‌రో రెండు బ్రాండ్ల మ‌ద్యం ధ‌ర‌ల‌ను సైతం త‌గ్గించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో గ‌త ప్ర‌భుత్వం నాణ్య‌మైన మ‌ద్యం దొర‌క‌క‌పోవ‌డంతో మద్యం ప్రియులు ఎంతో ఇబ్బంది ప‌డిన సంగ‌తి తెలిసిందే.

 

రాష్ట్రంలో ద‌శ‌ల‌వారిగా మ‌ద్య నిషేదం చేస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ఇచ్చిన మాట త‌ప్పింది. అంతే కాకుండా మ‌ద్య నిషేదంవైపు అడుగులు వేయ‌కుండా కొత్త బ్రాండ్ల‌ను ప‌రిచ‌యం చేసింది. నాణ్య‌త లేని బ్రాండ్ల‌ను తీసుకువ‌చ్చి వాటికి భారీగా రేట్లు నిర్ణ‌యించ‌డంతో కొంత‌మంది పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లిన‌ప్పుడే మ‌ద్యం తాగే ప‌రిస్థితి వ‌చ్చింది.

 

రాష్ట్రంలో అమ్మే మ‌ద్యం బ్రాండ్లు కూడా మాజీ సీఎం జ‌గ‌న్, మాజీ మంత్రుల కుటుంబాల‌కు చెందిన‌వాళ్ల‌వే అని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ తాము అధికారంలోకి వ‌స్తే ప్ర‌స్తుతం ఉన్న మ‌ద్యం బ్రాండ్ల అనుమ‌తులు ర‌ద్దు చేసి నాణ్య‌మైన నేష‌న‌ల్ , ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చింది. సామాన్యుల‌కు కూడా అందుబాటులో ఉండేలా ధ‌ర‌లు నిర్ణ‌యిస్తామ‌ని చెప్పింది. ఇచ్చిన హామీని నెర‌వేరుస్తూ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఇప్పుడు అడుగులు వేస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram