E-PAPER

ఢిల్లీలో భారీ పేలుడు క‌ల‌క‌లం..!

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఉద‌యం భారీ పేలుడు సంభవించింది. ప్రశాంత్‌ విహార్‌ ప్రాంతంలోని పీవీఆర్ మల్టీప్లెక్స్‌ సమీపంలోని ఓ స్వీట్‌ షాప్‌లో ఈ ఘటన జ‌రిగింది. గురువారం ఉదయం 11:48 గంటల సమయంలో స్వీట్‌ షాప్‌ వద్ద పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది.

 

దాంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంట‌నే ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది ఫైర్ ఇంజిన్ల‌తో మంట‌ల‌ను అదుపులోకి తెచ్చాయి. ఇక‌ రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వ‌హించారు. ప్రమాద స్థలిలో తెల్లటి పొడి లాంటి పదార్థం దొరికినట్లు పోలీసులు వెల్ల‌డించారు.

 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి భారీ శ‌బ్ధం కార‌ణంగా చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది

Facebook
WhatsApp
Twitter
Telegram