ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar )కాంబినేషన్ లో 2021లో విడుదలైన సినిమా పుష్ప (Pushpa). ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాలీవుడ్ లో రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)వదులుకున్న ఈ సినిమాలో బన్నీ అద్భుతంగా నటించారు. అంతేకాదు తన నటనతో జాతీయస్థాయి అవార్డు అందుకొని..తొలి నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. మొత్తానికైతే పుష్ప (Pushpa) సినిమాతో భారీ రికార్డులు క్రియేట్ చేసిన ఈ కాంబో, సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ‘పుష్ప -2’ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.
పుష్ప -2 రన్ టైమ్ లాక్..
తాజాగా ఈ సినిమా రన్ టైమ్ లాక్ చేశారని, అయితే చిత్ర బృందం దీనిపై అధికారిక ప్రకటన చేస్తుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి 3 గంటల 15 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. ఇకపోతే మూడు గంటలు సినిమా అంటే చిత్ర బృందం సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా రెండు గంటలసేపు థియేటర్లలో ఆడియన్స్ ని కూర్చోబెట్టాలంటేనే హీరో దర్శకులకు కొత్తిమీర సామ లాంటిది. అలాంటిది మూడు గంటలు అంటే ఇక సినిమాలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మూడు గంటలసేపు ఆడియన్స్ ని థియేటర్లలో కూర్చోబెట్టాలి అంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
అందులో మొదటిది.. మొదటి భాగానికి రెండవ భాగానికి లింకు చాలా బాగా కుదరాలి.
ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ ట్విస్ట్ లతో ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తించాలి.
సెకండ్ హాఫ్ లో ఎక్కడ కూడా ల్యాగ్ ఉండకూడదు.
ఇక క్లైమాక్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలి.
సినిమాలో చూపించే సెంటిమెంట్ సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయిపోయి భావోద్వేగానికి గురయ్యేలా ఉండాలి.
ముఖ్యంగా సినిమా చూసినంత సేపు ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకూడదు.
ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు మూడు గంటల పైన నిడివి ఉన్న సినిమా థియేటర్లలో నడుస్తుంది అనేది వాస్తవం.
మరి పుష్ప -2 సినిమాకి మూడు గంటల కంటే ఎక్కువగానే టైమ్ ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ టైం లో సినిమా ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
పుష్ప -2 తారాగణం..
ఇకపోతే పుష్ప -2 లో రష్మిక మందన్న(Rashmika Mandanna) లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా.. యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. అలాగే ఫహాద్ ఫాజిల్ (Fahad fazil), సునీల్ (Sunil), అనసూయ(Anasuya)తదితరులు విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇందులో జగపతిబాబు(Jagapati babu )కీలక పాత్ర పోషిస్తూ ఉండడం గమనార్హం.
నటీనటుల రెమ్యూనరేషన్.
ఇక్కడ నటీనటులు రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఇందులో అల్లు అర్జున్.. పారితోషకం కాకుండా లాభాల్లో వాటా అంటే రూ.300 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇక రష్మిక రూ .10కోట్లు , ఫహద్ ఫాజిల్ రూ.8 కోట్లు, శ్రీ లీల రూ.2 కోట్లు తీసుకోబోతున్నట్లు సమాచారం.