సినీ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది దీంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్, షాద్నగర్ ఫామ్ హౌస్లలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో వర్మ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక సినిమా చేసినట్లు టిడిపి ఆరోపిస్తోంది. అంతేకాక ఆ సినిమాని ప్రమోట్ చేసే క్రమంలో నారా లోకేష్, నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినట్టు ఆయన మీద మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రాంగోపాల్ వర్మ కి పలుసార్లు నోటీసులు జారీ చేశారు.
తమ ఎదుట విచారణకు హాజరు కమ్మని కోరితే రాంగోపాల్ వర్మ పలు కారణాలతో విచారణకు హాజరు కాకుండా వస్తున్నారు. ఈరోజు కచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆయన పోలీసులకు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లోని ఆర్జీవి డెన్ కి వచ్చారు. అయితే ఆయన ఏదో అత్యవసర పనిమీద బయటకు వెళ్లారని, ప్రస్తుతం ఆఫీసులో లేరని అక్కడి స్టాఫ్ చెబుతూ వచ్చారు. కొద్దిసేపటి క్రితం వచ్చిన వర్మ లాయర్ ఫిజికల్ గా హాజరు కావడం కష్టమని కావాలంటే వర్చువల్ గా హాజరవుతామని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం వర్మని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా తెలియడంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి.