సినీనటులు సమంత, నాగచైతన్యలు విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వారు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరిద్దరూ ఒకరిపై మరొకరు ఎలాంటి కామెంట్స్ చేసుకోలేదు. సినీ నటి శోభితను నాగచైతన్య కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు.
మరోవైపు, సమంత నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలయింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలిచ్చింది. ఖరీదైన గిఫ్ట్ ను ఎవరికైనా ఇచ్చిన తర్వాత… ఆ గిఫ్ట్ వేస్ట్ అయిందని ఎప్పుడైనా అనిపించిందా? అని వరుణ్ అడిగాడు. దీనికి సమాధానంగా… ‘నా ఎక్స్ (మాజీ భర్త)కు ఇచ్చిన బహుమతి’ అని సమంత సమాధానమిచ్చింది.