E-PAPER

వైసీపీకి మరో భారీ షాక్… పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి వెంకటరమణ రాజీనామా..

వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ కు పంపించారు. ఆయన కూటమి పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో ఆయన చర్చిస్తున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

ఇప్పటికే వైసీపీకి పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. తాజాగా వెంకటరమణ రాజీనామాతో ఆ పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. మరికొందరు నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఇదే జరిగితే వైసీపీ పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే అవకాశం ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram