E-PAPER

ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

ఎన్నికల్లో చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. సూపర్‌-6లో మరో ముఖ్యమైన పథకానికి పచ్చజెండా ఊపింది. మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీపావళి కానుకగా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రకటించింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారందరూ ఉచిత సిలిండర్‌కు అర్హులని ప్రభుత్వం తెలిపింది.

 

సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలో ఈ ఉచిత సిలిండర్ల దీపం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలోని గుడిపాలలో రవాణా శాఖ మంత్రి రామ్‌ ప్రసాద్‌ రెడ్డితో ఉచిత సిలిండర్ల పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభిస్తారు.

 

లబ్ధిదారులు ఇప్పటి మాదిరిగానే గ్యాస్‌ సిలిండర్లు నగదును చెల్లించి గ్యాస్ సిలిండర్‌ పొందనున్నారు. సిలిండర్‌ ఇంటికి డెలివరీ అయిన 48 గంటల్లో ప్రత్యక్ష నగదు బదిలీవిధానంలో వ్యక్తిగత బ్యాంకు అకౌంట్‌కు నగదును జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలల్లో ఒక గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడైనా ఉచితంగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

 

బుకింగ్, డెలివరీ, నగదు జమ తదితర సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌కు, గ్రామ స్థాయిలో సచివాలయాల్లో తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు.ఉచిత సిలిండర్‌ పొందేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన లబ్దిదారులందరికీ ఉచిత సిలిండర్‌ అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్పష్టం చేశారు.

 

ఈ నేపథ్యంలో.. ఏ ప్రభుత్వం ఇవ్వని వరం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం.. దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిడర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇది మా చిన్న కుటుంబాలకు ఎంతో సాయం అంటూ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

మరోవైపు APలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటికే 32.84 లక్షల మందికి పింఛన్లు అందచేశారు.

Recent News :

Facebook
WhatsApp
Twitter
Telegram