E-PAPER

కోర్టులో హీరో నాగార్జున స్టేట్మెంట్.. కొండా సురేఖపై సంచలన వ్యాఖ్యలు..!

టాలీవుడ్ నటీమణి సమంత పైన అలాగే అక్కినేని నాగార్జున కుటుంబం పైన మంత్రి కొండ సురేఖ సంచలన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాలలో తీవ్ర దుమారానికి కారణమైన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యల పైన అక్కినేని నాగార్జున కుటుంబం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే.

 

కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన నాగార్జున

అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులపైన కొండా సురేఖ మాట్లాడిన తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కినేని నాగార్జున ఆమెపై క్రిమినల్ కేసుతో పాటు సివిల్ పరువు నష్టం దావా కూడా వేసిన విషయం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తిగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు నేడు నాంపల్లి కోర్టుకు వెళ్లిన అక్కినేని నాగార్జున కోర్టులో తమ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

 

కోర్టుకు హాజరైన నాగార్జున కుటుంబం, సాక్షులు

అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ను ఇటీవల విచారించిన నాంపల్లి కోర్టు నాగార్జున స్టేట్మెంట్ ను ఈరోజు రికార్డు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు నాగార్జున హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. నాగార్జునతో పాటు ఆయన భార్య అమల, కుమారుడు నాగచైతన్య, సాక్షులు సుప్రియ, వెంకటేశ్వర్లు సైతం కోర్టుకు హాజరయ్యారు.

 

స్టేట్మెంట్ లో నాగార్జున చెప్పిందిదే

మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం పైన వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని దీంతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని పరువు నష్టం దావాలో పేర్కొన్న నాగార్జున ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నాగార్జున అదే పేర్కొన్నారు.

 

కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

మంత్రి కొండ సురేఖ తమ కుటుంబం పై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారని తన కుమారుడు నాగచైతన్య సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. సమాజంలో తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, కొండ సురేఖ వ్యాఖ్యల కారణంగా తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని నాగార్జున నేడు కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చెప్పినట్టు సమాచారం.

 

ఈ కేసులో ముందు ముందు ఏం జరుగుతుందో?

మొత్తానికి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారాన్ని వదిలిపెట్టని నాగార్జున తనదైన శైలిలో ఆమెను టార్గెట్ చేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్లి మరీ వాంగ్మూలం ఇచ్చి వచ్చారు. మరి ఈ కేసులో ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram