‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల మెప్పు పొందిన సంగతి తెలిసిందే.
తాజాగా అ్లలు అర్జున్-సుకుమార్ కలయికలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 ది రూల్ వస్తోంది. మొదటగా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాడానికి ప్లాన్ చేశారు. అయితే చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులు బ్యాలెన్స్ ఉండటంతో మేకర్స్ డిసెంబరు 6కు వాయిదా వేశారు.
ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు, టీజర్‌కు వచ్చిన అనూహ్య స్పందన చిత్రంపై మరింత అంచనాలు పెంచేశాయి. అయితే డిసెంబరు 6న విడుదల లక్ష్యంగా ఈ చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట%