ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆయనపై లైంగిక ఆరోపణల కేసు చేశారు. తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
సదరు మహిళ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నార్సింగి పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.