E - PAPER

E-PAPER

శిరసు వంచి క్షమాపణలు చెప్తున్నానన్న మోదీ..!

మహారాష్ట్రలో చత్రపతి శివాజీ భారీ విగ్రహం కూలిన ఘటన పైన విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లాలో ఏర్పాటుచేసిన మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన పైన మోడీ సర్కార్ ను టార్గెట్ చేసి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

 

చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటనతో మోదీ సర్కార్ పై విమర్శలు

ముఖ్యంగా కాంగ్రెస్, శరత్ పవార్ ఎన్సిపి, ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.ఈ క్రమంలో మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన పైన స్పందిస్తూ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటన పైన మాట్లాడిన ఆయన, ఎక్స్ వేదికగా కూడా ఒక పోస్ట్ చేశారు.

శిరసు వంచి క్షమాపణలు చెప్తున్నానన్న మోదీ

చత్రపతి శివాజీ మహారాజ్ ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. చత్రపతి శివాజీ మహారాజ్ ను తమ దైవంగా భావించేవారు ఈ ఘటనతో తీవ్ర వేదనకు గురయ్యారని నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నానని మోదీ పేర్కొన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదని మోదీ మాట్లాడారు.

 

మహారాష్ట్రలో పర్యటించిన మోడీ స్పందన

ఈరోజు మహారాష్ట్రలోని పాల్ఘర్ లో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన 35 అడుగుల ఎత్తున చత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. అయితే ఇటీవల మహారాష్ట్రలో కురిసిన వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్టు భావిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే విగ్రహం కూలిపోవడం వెనుక అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు చెబుతున్నారు.

 

విగ్రహం మోదీ ఆవిష్కరించి తొమ్మిది నెలలైనా కాకముందే ఘటన

చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కనీసం తొమ్మిది నెలలైనా పూర్తి కాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ నాణ్యత మీద లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంత నిర్లక్ష్యంగా తయారు చేసిన ఎన్డీఏ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram