E - PAPER

E-PAPER

తొమ్మది కీలక సర్టిఫికెట్ల జారీ ఇక నుంచి ఇలా..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాల ద్వారా కొత్తగా తొమ్మిది రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మీసేవలో వీటిని కొత్తగా చేర్చుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఆ స‌ర్టిఫికెట్లు ఈజీగా పొందే వెసులుబాటు కలగనుంది. తొమ్మిది రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు ‘మీ సేవ ఆన్‌ బోర్డ్‌’లో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

 

మీసేవా కేంద్రాల్లో

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలను ఎక్కువగా అవసరం ఉండే ధృవపత్రాలు సులభతరంగా పొందేలా మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా తొమ్మది రకాల రెవిన్యూ సేవలు మీ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఎంఆర్వో ఆఫీసుల్లో మాన్యువల్‌గా అందిస్తున్న‌ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్ర‌క‌టించింది.

 

 

9 రెవిన్యూ సేవలు

ప్రభుత్వం తాజా నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రజలకు వెసులుబాటు కలగనుంది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో కొత్తగా.. గ్యాప్‌ సర్టిఫికెట్‌, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్‌, మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ), క్రిమిలేయర్‌, నాన్‌ క్రిమిలేయర్‌ సర్టిఫికెట్లు, మార్కెట్‌ విలువపై సర్టిఫైడ్‌ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్‌ కాపీలు ఇకపై ఆన్‌లైన్‌లో మీసేవ ద్వారా అందజేయనున్నారు.

 

ప్రభుత్వం కసరత్తు

అదే విధంగా ప్రజలకు సంబంధించిన పాలనా పరమైన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజలు ప్రభుత్వం నుంచి పొందే సదుపాయాలు, పథకాలకు సంబంధించిన దరఖాస్తులు..పరిశీలన..ఆమోదం వంటి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ పద్దతిలో తెలుసుకొనేలా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన ప్రారంభం అవుతున్న వేళ..ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్ లైన్ ద్వారా సమాచారం వెల్లడయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram