E - PAPER

E-PAPER

టీ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ గా మాజీ సీఎం..?

తెలంగాణ పార్టీ వ్యవహారాల పై ఏఐసీసీ కీలక మార్పులకు సిద్దమైంది. కొత్త పీసీసీ చీఫ్ తో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను నియమించనుంది. ఇప్పటికే ఈ హోదాల్లో నియమించే వారి పేర్లను ఖరారు చేసిది. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. అదే సమయంలో మూడు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనేక చర్చల తరువాత టీపీసీసీ చీఫ్ గా బీసీ వర్గానికి చెందిన నేతకే పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయింది.

 

కసరత్తు

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవుల కసరత్తు హైకమాండ్ పూర్తి చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ లు.. పీసీసీ చీఫ్ ల నియమాకం పైన ఫైనల్ నిర్ణయానికి వచ్చింది. మూడు రాష్ట్రాలను పీసీసీ చీఫ్‌లను ప్రకటించనున్న ఏఐసీసీ వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం మూడు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల ప్రకటన చేసేందుకు రంగం సిద్దం అయింది.

 

తుది ఎంపిక

ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగానే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. అదే విధంగా పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్‌గా దీపాదాస్ మున్షీని ఖరారు చేసారు. ఇక, కేరళ పీసీసీ అధ్యక్షుడుగా కేసీ వేణుగోపాల్ ను నియమించారు. కేసీ వేణుగోపాల్ స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అశోక్ గెహ్లాట్ ను నియమిస్తూ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బగెల్ ను నియమించాలని డిసైడ్ అయ్యారు.

 

ఏఐసీసీ నిర్ణయం

బీసీ వర్గానికి చెందిన ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్…ఎమ్మెల్సీగా ఉన్న బొమ్మ మహేష్ గౌడ్ పేరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ లోకి వచ్చిన సమయం నుంచి పీసీసీ అధ్యక్షుడుగా..సీఎం అయిన సమయంలోనూ మహేష్ పూర్తి మద్దతుగా నిలిచారు. ఏఐసీసీ నిర్ణయం తాన ఛాయిస్ చెప్పినా…పార్టీ నాయకత్వం పీసీసీ అధ్యక్షుడి నియామకంలో తీసుకొనే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రేవంత్ స్పష్టం చేసారు. ఇక..మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram