కాదంబరి జెత్వానీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వంలోని ముఖ్యులతో పాటుగా పోలీసు అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదులో పలు కీలక అంశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రత్యేక పోలీసు అధికారి విచారణ చేస్తున్నారు. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారుల ప్రమేయం పైన విమర్శలు ఉన్నాయి. తాజాగా, ఈ కేసు పైన కేంద్ర హోం శాఖ ఆరా తీసినట్లు సమాచారం
కీలక అంశాలు
కాదంబదరి జెత్వాని పోలీసుల విచారణలో పలు సంచలన అంశాలను వెల్లడించారు. ముగ్గురు పోలీసు అధికారులు కీలక పాత్ర పోషించారని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నాడు నిఘా చీఫ్ గా వ్యవహరించిన పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ ఉన్నారని దర్యాప్తులో వెల్లడించారు. తన పైన విజయవాడలో కేసు నమోదుకు ముందు ముంబాయిలో తన ఇంటి వద్దకు ముందుగా రెక్కీకి పంపారని చెప్పినట్లు సమాచారం. తమకు అనుకూలంగా ఉందని ఖరారు చేస్తున్న తరువాత కార్యాచరణ ప్రారంభించారని వెల్లడించారు.
పక్కా ప్రణాళిక
ముందస్తు ప్రణాళికలో భాగంగానే విద్యాసాగర్ తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమెదు చేసారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ముంబాయికి విజయవాడ పోలీసులు వచ్చి తాను అక్కడ నమోదు చేసిన కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసారని చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా పదేళ్లలోపు శిక్ష పడే కేసు, సివిల్ కేసులో మహిళను విచారించేందుకు నోటీసు ఇవ్వాలని… సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం విచారించాల్సి ఉన్నా… ఆ నిబంధనలన్నీ తుంగలోకి తొక్కారని విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది.
ఆయన కోసమేనా
ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌లో 2023 డిసెంబరు 17న సజ్జన్ జిందాల్‌పై కేసు నమోదయింది. ఆ తరువాత 12 రోజులకు అంటే 2023 డిసెంబరు 29న సజ్జన్ జిందాల్ తాడేపల్లిలో జగన్‌ను కలిశారు. 2024 ఫిబ్రవరి 2న కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు జత్వానీపై ఫిర్యాదు చేశారు. 3వ తేదీన పోలీసులు ముంబై నుంచి జెత్వానీని తీసుకొచ్చారు. పోలీసులు చెప్పిన వాటికన్నింటికీ జెత్వానీ తల్లి దండ్రులు పూర్తిగా అంగీకరించిన తరువాతే ఆమెకు ఫిబ్రవరి 14న బెయిల్ వచ్చింది. ముంబై పోలీసులు మార్చి 15న కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు కేంద్రం కూడా ఆరా తీసిందనే సమాచారంతో మొత్తం ఎపిసోడ్ కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.