E - PAPER

E-PAPER

క్యాస్టింగ్ కౌచ్‌పై నటి కల్పిక కామెంట్స్..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సహా ఇతర సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని వివిధ భాషలకు చెందిన నటీమణులు గత కొన్నేళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎక్కువైపోయింది. దీంతో ఈ వ్యవహారంపై బయటకొచ్చి నోరు విప్పితే ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో.. లేక ఎవరైనా ఏమైనా చేస్తారని ఇప్పటి వరకు చాలా మంది వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు తెగించి పలువురు నటీమణులు ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీ కెరీర్‌ మొదట్లో ఎదర్కొన్న అనుభవాలను ఒక్కొక్కరుగా చెప్పుకొస్తున్నారు. ఒక కొత్త వ్యక్తికి లేదా పాత వ్యక్తికి కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదురవుతూ ఉంటుంది. అయితే అది డైరెక్టగా అవ్వొచ్చు.. లేదా ఇన్ డైరెక్టగా అయినా అవ్వొచ్చు. అలా వారు ఎదుర్కొన్న అనుభాల్ని చెప్పుకొస్తున్నారు.

 

ఎంతో మంది నటీమణులు, హీరోయిన్లు కెరీర్లో ఇండస్ట్రీలోని పలువురు వ్యక్తుల నుంచి తాము ఎదుర్కొన్న వేధింపులను బయటకు చెప్పడానికి వెనుకాడటం లేదు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు బయటకొచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. తాజాగా మరో నటి తన కెరీర్‌ మొదట్లో ఎదుర్కొన్న అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైన క్యాస్టింగ్ కౌచ్ తనకు ఎదురైందని ఆమె తెలిపారు.

 

ఆమె మరెవరో కాదు నటి కల్పిక గణేశ్. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో తెలుగు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాల్లో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే అందుకు కారణాన్ని కూడా తెలిపింది. అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది. ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో మీరు కూడా పడ్డారా? అని యాంకర్ నటి కల్పికను అడగ్గా.. మొదట్లో నేను అమయాకత్వంతో ఉండటం వల్ల కొన్నిసార్లు కొన్ని ప్లేస్‌లలో అప్రోచ్ అయ్యాను. తర్వాత తర్వాత వాళ్లకే అర్థం అయింది. నేను ఆ టైప్ కాదని.. అప్పటి నుంచి నాకు అవకాశాలు వరుసగా తగ్గుతూ వచ్చాయి అని కల్పిక గణేశ్ తెలిపారు.

 

అయితే ఈ వ్యవహారం డైరెక్ట్‌గా అయినా అవుతుంది లేక ఇన్‌డైరెక్ట్‌గా అయినా అవుతుందని.. అయితే దాన్ని మనం ఎలా డీల్ చేస్తామన్నది విషయం అని చెప్పుకొచ్చారు. అయితే ఎవరైనా నన్ను డైరెక్టగా వచ్చి అడిగితే.. నేరుగా ఫేస్ టు ఫేస్ చెప్పేదాన్ని. ఇంకోసారి ఇలా చేస్తే చెంప చెల్లుమనిపిస్తా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఇలాంటి వాటికోసం అయితే మళ్లీ పిలవకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగేదని చెప్పుకొచ్చారు.

 

రిజక్షన్స్ ఎందుకు

 

నాకు నచ్చే రోల్ రావాలని అనుకునేదాన్ని. ఇలాంటి రోల్ చేయాలి. కానీ ఎందుకు ఇలాంటి రోల్స్ రావట్లేదని అనుకునేదాన్ని. నేను ఇంకా పైకి వెళ్లడానికి ఏమేమి చేయాలి అని ఆలోచించేదాన్నని చెప్పుకొచ్చారు. జనాల్ని కలవడం, రిజక్షన్స్ ఎందుకు వచ్చాయి అని అడగం చేసేదాన్నని తెలిపారు. అయితే యశోద, అధర్వ సినిమాల్లో మంచి రోల్స్ చేశానని చెప్పుకొచ్చారు. అయితే రిజక్షన్స్ రావడం పై మాట్లాడుతూ.. నేను సైడ్ ఆర్టిస్ట్‌గా చేయడం లేదా కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడంతో కొన్ని రిజక్షన్స్‌ను ఫేస్ చేశాను. ఎందుకంటే.. హీరోయిన్ కంటే బాగున్నానని.. హీరోయిన్ కంటే బాగా మాట్లాడుతున్నానని.. హీరోయిన్ కంటే టాల్‌గా ఉన్నానని చెప్పి నన్ను సైడ్ చేసేవారు.

Facebook
WhatsApp
Twitter
Telegram