రాష్ట్రంలో సంచలనంగా మారిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (Hydra) హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై వేటు వేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు అనధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా సిఫారసు చేసింది. హెచ్ఎండీఏలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ విషయంలో హైడ్రా కమిషనర్రంగనాథ్చాలా సీరియస్‌గా ఉన్నారు. మొదట్లోనే చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన అన్ని విభాగాలకు లేఖలు రాశారు. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై విజిలెన్స్విచారణ జరిపి ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు. హైడ్రా కమిషనర్అన్నట్లుగానే ఆరుగురు అధికారులపై క్రిమినల్కేసులు పెట్టాలని సైబరాబాద్కమిషనర్కు రంగనాథ్సిఫారసు చేశారు.
జీహెచ్ఎంసీ చందానగర్డిప్యూటీ కమిషనర్‌తో పాటు హెచ్ఎండీఏ అసిస్టెంట్ప్లానింగ్ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్కమిషనర్, సర్వేయర్సహా బాచుపల్లి తహశీల్దార్‌పై కేసు నమోదు చేయాలని హైడ్రా నిర్ణయించారు. బాచుపల్లి ఎర్రకుంటలో ఇటీవల హైడ్రా అక్రమంగా నిర్మిస్తున్న మూడు భవనాలు నేలమట్టం చేసింది. ఆ భవనాలపై స్థానికుల నుంచి వరుస ఫిర్యాదులు అందుతున్నా పట్టించుకోలేదని అధికారులపై అభియోగాలున్నాయి.
అంతేగాక, ఆధారాలతో సహా సమర్పించినా ఫిర్యాదులను పక్కనపెట్టేశారని హైడ్రా దృష్టికి వచ్చింది. స్థానికుల ఫిర్యాదులను, అధికారులపై అభియోగాలను పరిశీలించిన రంగనాథ్.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. వీరితోపాటు గండిపేట వద్ద ఖానాపూర్, చిల్కూరులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి సూపరింటెండెంట్‌పైనా చర్యలు తీసుకునేందుకు హైడ్రా ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులను ఎవరిని ఉపేక్షించేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీరుపారుదల, మున్సిపల్ శాఖల్లో అక్రమ అనుమతులపై జాబితాను సిద్ధం చేసిన హైడ్రా శాఖల వారీగా పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్రమ నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారుల్లో ఆందోళన మొదలైంది.