E - PAPER

E-PAPER

విజయవాడ సీపీ వద్దకు కాదంబరీ జెత్వానీ.. కీలకంగా జిందాల్ పై ఫిర్యాదు !

గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు, రాజకీయ నేతల వేధింపులకు గురైన ముంబై నటి కాదంబరీ జెత్వానీ ఇవాళ విజయవాడ రానున్నారు. రాగానే నేరుగా విజయవాడ పోలీసు కమిషనర్ వద్దకు వెళ్లి తనపై జరిగిన వేధింపులపై ఫిర్యాదు చేయనున్నారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగానే విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఇప్పుడు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అసలు కేసును విచారిస్తారు.

మరోవైపు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో ఉన్న వివాదం కారణంగానే కాదంబరీ జెత్వలానీనీ పోలీసులు వేధించినట్లు ఇప్పటివరకూ భావిస్తుండగా.. పారిశ్రామిక వేత్త సజ్జన్ జిందాల్ పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. సజ్జన్ జిందాల్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అప్పటి ప్రభుత్వం పెద్దలతో సన్నిహితంగా మెలిగారు. అయితే ముంబైలో సజ్జన్ జిందాల్ పై కాదంబరి చేసిన ఫిర్యాదు ఆమెపై వేధింపులకు ప్రధాన కారణం అయి ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాదంబరి నుంచి ఫిర్యాదు అందాక విచారణ వేగవంతం కానుంది.

ఇప్పటికే కాదంబరి లాయర్ నర్రా వెంకటేశ్వరరావు తాజాగా ఈ వ్యవహారంపై మాట్లాడుతూ ముంబైలో జిందాల్ పై పెట్టిన కేసు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేసేందుకే ఆమెను వేధించినట్లు ఆరోపించారు. అందులో భాగంగానే కాబందరిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వృద్ధులైన ఆమె తల్లితండ్రుల్ని కూడా జైలుకు పంపించారన్నారు. అప్పట్లో విజయవాడ జైల్లో కాదంబరితో పాటు ఆమె తల్లితండ్రులు కూడా 42 రోజుల పాటు రిమాండ్ లో గడిపారు. ఆ సమయంలో ఐపీఎస్ లు అక్కడికి వెళ్లి ఆమెను ముంబైలో జిందాల్ పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె కేసు ఉపసంహరించుకున్నారు.

మరోవైపు కాదంబరిపై అప్పట్లో ఇబ్రహీం పట్నం పీఎస్ లో కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా పెట్టిన ఫోర్జరీ కేసు వాస్తవికతతను నిర్ధారిచేందుకు విజయవాడ సీపీ ఇప్పటికే విచారణాధికారిని నియమించారు. నిన్న స్వయంగా ఇబ్రహీంపట్నం పీఎస్ కు వెళ్లి ఈ కేసు నమోదులో తప్పిదాలు ఉన్నట్లు గుర్తింంచారు. విచారణాదికారి నివేదిక రాగానే ఈ వ్యవహారంపై ఆయన ఓ ప్రకటన చేయనున్నారు. ఇది తప్పుడు కేసుగా నిర్ధారణ అయితే దీని ఆధారంగా ఆఘమేఘాలపై ముంబై వెళ్లి కాదంబరి, ఆమె తల్లితండ్రుల్ని అరెస్టు చేసిన ఐపీఎస్ లకు ఉచ్చు బిగుస్తుందని భావిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram