నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ పబ్ కు వెళ్లినా .. చివర్లో జై బాలయ్య అనే స్లోగన్ తోనే ముగుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పవర్ అంటే బాలయ్య.. ఆ పేరులోనే పవర్ ఉంటుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ .. ఇంకోపక్క యాడ్స్ తో కూడా బిజీగా మారుతున్నాడు.
ఒకప్పుడు సినిమాలకు మాత్రమే ఆ పరిమితమైన బాలకృష్ణ.. ఈ మధ్య ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నిస్తున్నాడు. హోస్ట్ గా మారాడు.. కొన్ని ప్రొడక్స్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అప్పుడప్పుడు తన లుక్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పటికే బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి 50 వసంతాలు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 1 న ఆ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
వాటిని పక్కన పెడితే.. ప్రస్తుతం బాలయ్య NBK109 సినిమాతో బిజీగా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటున్న ఈ సినిమాకు అసురుడు అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. డైరెక్టర్ బాబీ.. ఈసారి బాలయ్య మరో కొత్త కోణంలో చూపించనున్నాడని టాక్. ఇక సినిమాలతో పాటు యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్న బాలయ్య.. తాజాగా ఒక యాడ్ షూట్ లో పాల్గున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ యాడ్ షూట్ కు సంబందించిన ఒక ఫోటో లీక్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ ఫొటోలో బాలయ్య ఎంతో అందంగా కనిపించాడు. పట్టు పంచెలో తెలుగుదనం ఉట్టిపడేలా నందమూరి నటసింహం దర్శనమిచ్చింది. అసలు బాలయ్యను ఇలా చూస్తే.. ఆయన వయస్సు 64 ఏళ్లు అంటే అస్సలు నమ్మరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఆ ముఖంలో తేజస్సు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
- ఇక ఈ వయస్సులో కూడా బాలయ్య ఇలాంటి తేజస్సును మెయింటైన్ చేయడం అనేది చాలా రేర్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. బాలయ్యను ఈ ఫొటోలో చూసిన అభిమానులు.. అబ్బా.. ఏమున్నాడ్రా బాబు.. ముఖంలో ఆ తేజస్సు చూడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లుక్ అదిరింది అని కొందరు.. వింటేజ్ బాలయ్య అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి బాలయ్య ఏ యాడ్ షూట్ కోసం ఇలా రెడీ అయ్యాడో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.