E - PAPER

E-PAPER

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేష్ బాబు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఛార్మింగ్ ను వర్ణించడం ఎవరివలన కాదు. మహేష్ కు రోజు రోజు వయసు పెరుగుతుందో తరుగుతుందో అర్ధం కావడం లేదు. సడెన్ గా మహేష్ ను.. గౌతమ్ పక్కన చూస్తే అన్నదమ్ములు అని చెప్పుకొస్తున్నారు. ఇక అమ్మాయిలు అయితే.. ఈ వయస్సులో ఉన్న మహేష్ ను చూసి కూడా.. మహేష్.. మహేష్ అని కలవరిస్తున్నారు అంటే ఆశ్చర్యం లేదు. అలాంటి అందగాడిని.. రాజమౌళి.. రగ్గడ్ లుక్ లోకి మార్చేశాడు.

 

గుంటూరు కారం సినిమాలోనే ట్రిమ్డ్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపించి కనువిందు చేసిన మహేష్.. రాజమౌళి సినిమా కోసం జుట్టు, గడ్డం పెంచుతున్నాడు. అసలు ఇప్పుడు మహేష్ బాబును చూస్తే.. ఎవరీ రగ్గడ్ లుక్ హీరో అని అనుకోకుండా ఉండలేరు. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తరువాత రాజమౌళి .. మహేష్ తో SSMB 29 ను ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను ఫినిష్ చేసే పనిలో జక్కన్న ఉండగా.. లుక్ మేకోవర్ లో మహేష్ బాబు ఉన్నాడు.

 

ఇకపోతే ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ ను పెట్టే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ ఎంతో కష్టపడుతున్నాడు. మొదటి నుంచి మహేష్ ఈ రేంజ్ రగ్గడ్ లుక్ లో ఫ్యాన్స్ చూసింది లేదు. తాజాగా మహేష్ న్యూ లుక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక అభిమానితో మహేష్ ఫొటోకు ఫోజిచ్చాడు. పొడవైన జుట్టు.. దాన్ని కవర్ చేస్తూ వైట్ క్యాప్, గుబురు గడ్డం, బ్లాక్ టీ షర్ట్ తో ఎంతో అందంగా కనిపించాడు.

 

ఇక ఈ లుక్ చూసిన అభిమానులు.. సూపర్ సూపర్ .. బాబులకే బాబు మహేష్ బాబు అని కొందరు.. ఏమయ్యా.. రాజమౌళి.. ఎలా ఉండేవాడిని.. ఎలా చేశావయ్యా..? అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఇప్పటివరకు కూల్ లుక్ లో బాబును చూసిన అభిమానులు.. సడెన్ గా ఈ రగ్గడ్ లుక్ ను చూసి షాక్ అవుతున్నారు. ఏంటి.. ఈయన మహేష్ బాబునా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ఏడాదిలోనే ssmb29 సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. మరి ఈ చిత్రంతో ఈ కాంబో ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

Facebook
WhatsApp
Twitter
Telegram