E - PAPER

E-PAPER

రేవంత్ సోదరుడు సహా ప్రముఖులకు హైడ్రా నోటీసులు..!!

హైడ్రా టెన్షన్ కొనసాగుతోంది. చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేసిన వారిని వదిలేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు పలువురు ప్రముఖుల నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా తర తరువాతి లక్ష్యం పైన గురి పెట్టింది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా తగ్గేది లేదని రేవంత్ వెల్లడించారు. చిత్రపురి కాలనీలో నోటీసులు ఇచ్చిన హైడ్రా ఇప్పుడు దుర్గం చెరువులో నిర్మాణాలకు నోటీసులు పంపారు. ఈ జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు.

 

హైడ్రా నోటీసులు

హైడ్రా దూకుడు కొనసాగుతోంది. చెరువులు, నాళాల ఆక్రమణలకు పాల్పడి, అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినవారి జాబితాలను హైడ్రా సేకరించింది. హైటెక్‌సిటీలోని రాయదుర్గం, మాదాపూర్‌ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించినవారు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇండ్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

 

ప్రముఖుల నివాసాలు

హైడ్రా నోటీసులు జారీ చేసిన వారిలో పలువురు ఐఏఎస్‌లు, ఐఆర్‌ఎస్‌ అధికారులకు చెందిన నివాసాలు ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సోద‌రుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు. చెరువులను పరిరక్షించేందుకే హైడ్రా పని చేస్తుందని రేవంత్ స్పష్టం చేసారు. చెరువులను ఎవరు ఆక్రమించినా..ఏ పార్టీ వారైనా వదిలేదని తేల్చేసారు. అందరూ సహకరించాలని కోరారు. కేటీఆర్ కు చెందినది గా ప్రచారంలో ఉన్న జన్వాడ ఫాం హౌస్ లోనూ తాజాగా ఇరిగేషన్ అధికారులు కొలతలు చూసారు. ఆక్రమణల పైన నివేదిక సిద్దం చేస్తున్నారు.

 

హైడ్రా దూకుడుతో

హైటెక్‌సిటీలోని రాయదుర్గ్, మాదాపూర్‌ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి. ఇప్పుడు అధికారులు, ప్రముఖుల నివాసాలకు హైడ్రా నోటీసులు ఇవ్వటం తో వారిలో టెన్షన్ మొదలైంది. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారుల ఈ ప్రాంతం పైన ప్రస్తుతం ఫోకస్ చేసారు. చెరువును ఆనుకొని ఖరీదైన భవనాలు నిర్మాణం కావటంతో తాజాగా నోటీసులు జారీ అయ్యాయి. 30 రోజుల్లోగా ఆక్రమణలు కూల్చేయాలని సూచించారు. వీరి నుంచి వచ్చే సమాధానం ఆధారంగా హైడ్రా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram