ఎన్నికల్లో ఓటమితో వైసీపీ ముఖ్యులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన రావు టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైంది. పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేసారు. ఇంకా లిస్టులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని పైన రోజా ఈ రోజు చేసిన ట్వీట్ తో క్లారిటీ వచ్చింది.
రోజా అడుగులు
వైసీపీలో ముఖ్యులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ బెంగళూరులో ఉన్నారు. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీడీపీ ముఖ్యులతో టచ్ లోకి వెళ్లారు. ఇద్దరు ఎంపీలు పార్టీ వీడటం ఖాయమైంది. ఇదే సమయంలో మాజీ మంత్రులు సైతం పార్టీ వీడుతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి రోజా వైసీపీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రోజా తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో జగన్ తో ఉన్న ఫొటో తొలిగించటంతో ఇక వైసీపీకి రాజీనామా ఖాయమనే ప్రచారం ప్రారంబమైంది.
వైసీపీలో ఉంటారా
రోజా ఏపీలో రాజకీయాల్లో వేరే పార్టీలో చేరుతారనే వాదన తెర మీదకు వచ్చింది. అదే సమయంలో రోజా తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన తమిళ్ వెట్రి కళగం ద్వారా రోజా అక్కడ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరి కొన్ని వార్తలు తెర మీదకు వచ్చాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా వ్యవహరించిన రోజా ఇప్పుడు ఈ స్థాయిలో తాను వైసీపీ వీడుతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఈ వార్తలను ఖండించలేదు. సోషల్ మీడియా ద్వారానూ స్పందించలేదు.
రోజా ట్వీట్ తో
అయితే, ఈ ప్రచారం వేళ రోజా ఈ రోజున చేసిన ట్వీట్ అన్నింటికీ సమాధానంగా భావిస్తున్నారు. మాజీ సీఎం జగన్, భారతిలకు ట్విట్టర్ వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నేళ్లు గడిచినా చెదరని మీ అనుబంధం, ఇలాగే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ.. హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలంటూ విష్ చేశారు రోజా. ఈ ట్వీటం ద్వారా తాను జగన్ ను ఇప్పటికీ అన్నగానే భావిస్తున్నట్లు స్పస్టం చేసారు. వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిగానూ పని చేసారు. తాజా ఎన్నికల్లో ఓడిన తరువాత గ్యాప్ తీసుకున్నారు. రోజా తాజా ట్వీట్ వైరల్ గా మారింది.