E - PAPER

E-PAPER

ఏపీలో పింఛనుదారులకు సర్కారు గుడ్‌న్యూస్ ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పింఛనుదారులకు శుభవార్త చెప్పింది. ప్రతి నెలలా కాకుండా సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ ఇవ్వనుంది. ప్రతి నెలా 1వ తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సర్కారు ప్రకటన విడుదల చేసింది.

 

ఆగస్టు నెలాఖరుకే పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఒకటో తారీఖు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 31నే లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏదైనా కారణంతో తీసుకోని లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

 

పోలవరం ప్రాజెక్టును 2027, మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాజాగా, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఏపీకి ఎంతో ప్రయోజనకరమని చెప్పారు.

 

కేంద్ర కేబినెట్ నిర్ణయాలు నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి మంచి భరోసా ఇస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ఆమోదించిన పారిశ్రామిక హబ్‌ల వల్ల రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.

 

పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలకు సంబంధించి రెండు నోట్స్‌ను కేంద్రం క్లియర్‌ చేసిందని, కేంద్రం చర్యలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు రూ.12,127 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, పోలవరాన్ని 2027 మార్చిలోగా పూర్తి చేసేందుకు షెడ్యూల్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా రూ.15,146 కోట్లు ఇవ్వాలని, కేంద్రం ఇవ్వలేదని ఎప్పుడూ పోలవరం పనులు ఆపలేదని చంద్రబాబు చెప్పారు.

Facebook
WhatsApp
Twitter
Telegram