పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు అభిమానులు మర్చిపోలేని సినిమాల్లో ఖుషీ ఒకటి. పవన్ కళ్యాణ్, భూమిక జంటగా ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత సూర్య దర్శకుడుగా ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కించాడు. ఇక కొన్నేళ్ల క్రితం డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చి నటుడిగా సెటిల్ అయ్యాడు.
సూర్య హీరోగా, విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక తాజాగా సరిపోదా శనివారం సినిమాలో సూర్య విలన్ గా నటిస్తున్నాడు. నాని, ప్రియాంక మోహన్ జంటగా.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచిన వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.
ఇక సూర్య కనిపించిన ప్రతిసారి.. అందరూ అడిగే ప్రశ్న.. ఖుషీకి సీక్వెల్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అని.. ఇక ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ ప్రియాంక మోహన్ అదే విషయాన్నీ సూర్య ముందు పెట్టింది. దీనికి సూర్య అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఖుషీ 2 కథను పవన్ కళ్యాణ్ కు వినిపించినట్లు తెలిపి షాక్ ఇచ్చాడు.
” ఖుషీ 2 సినిమా కథ పవన్ గారి దగ్గరే ఉంది. ఆయన ఆ కథను చాలా ఎంజాయ్ చేశారు. కానీ, ఖుషీ 2 టైటిల్ పెట్టలేదు.. వేరే టైటిల్ తో కథ చెప్పాను. ఆ కథ విన్న పవన్.. సూర్య ఆ మైండ్ స్టేజ్ నుంచి దాటిపోయాను. నేను వెళ్లి లవ్ చేయడం, అలా అంతా వద్దు సూర్య అని అన్నారు. అలా ఏం లేదు సార్.. అక్కడ ఎంజీఆర్.. పెద్ద హీరో అయ్యాక కూడా లవ్ సబ్జెక్టులు చేశారు సార్ .. మీరు చేస్తే మంచిగానే ఉంటుంది అని అన్నాను. నో సూర్య.. నో సూర్య అని వదిలేశారు. అది వచ్చి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. నాకు ఆ బాధ ఉంది.
ఇప్పుడు పవన్ కాకుండా ఖుషీ 2 చేయాలంటే.. నాని, రామ్ చరణ్, విజయ్.. వీరికి బావుంటుంది. ఇక హీరోయిన్ గా అయితే ప్రియాంక మోహన్ సెట్ అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట వినగానే ఫ్యాన్స్ రామ్ చరణ్ తో ఖుషీ 2 తీయండి సూర్య సార్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఈ సినిమా ఎవరి చేతికి వెళ్తుందో చూడాలి.