E - PAPER

E-PAPER

దేవర.. మూడో పాట.. ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్..!

జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘దేవర’ సినిమా నుంచి వస్తున్న ఒకొక్క అప్ డేట్ ఒకొక్క రేంజ్ లో ఉంటోంది. ఇక సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా మొదటి పార్ట్ విడుదల చేసేందుకు సర్వ సన్నద్ధాలు జరిగిపోతున్నాయి.

 

ఇప్పటికే రెండు పాటల విడుదలై సంచలనం సృష్టించాయి. మూడో పాటకు సంబంధించి ఒక అప్ డేట్ ను పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ లో ఒక్కసారి పూనకాలు లోడింగ్ అయ్యాయి.

 

ఇంతకీ ఆయన పాట గురించి మామూలుగా చెబితే పర్వాలేదు. ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు. ఇంతకీ ఆయనేమన్నారంటే.. దేవర సినిమాలో వచ్చే మూడోపాట.. ఇంతకుముందు వచ్చిన చుట్టమల్లే సాంగ్ ని మించి ఉంటుందని తెలిపారు. అంతేకాక ఆ పాటలో జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ ఒక రేంజ్ లో ఉందని, ఆ పాట ఎప్పుడొచ్చినా బీభత్సమే అంటూ రాసుకొచ్చారు.

 

ఈ నేపథ్యంలో దేవర సినిమాలో మూడో పాటపై ఫ్యాన్స్, పబ్లిక్ లో అంచనాలు ఒక లెవల్ లో ఉన్నాయి. ఇకపోతే ఈసినిమాలో అందాలనటి శ్రేదేవి కుమార్తె జాన్వీకపూర్ నటిస్తోంది. అలాగే ప్రత్యేక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. అన్నింటికి మించి సెప్టెంబరు 27న దేవర …ప్రపంచం ముందుకు రాబోతున్నాడని చెబుతున్నారు.

 

ఇక థియేటర్లలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూస్తారని చెబుతున్నారు. ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఆయన నటన ఉండనుందని అంటున్నారు. ఇకపోతే దర్శకుడు కొరటాల శివ… చావో రేవో అన్న రీతిలో చేసిన సినిమా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని అంటున్నారు. ఇవన్నీ చూడాలంటే మరో నెలరోజులు సినిమా కోసం వేచి ఉండకతప్పదు.

Facebook
WhatsApp
Twitter
Telegram